Updated : 05 Jul 2022 06:55 IST

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలు

ఇద్దరి అరెస్టు, పరారీలో మరో ఇద్దరు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖల్లో పొరుగు సేవల కింద ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి, మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ రాఘవన్‌ వివరాలు వెల్లడించారు. మోటిరెడ్డి శివప్రకాశ్‌రెడ్డి అనేవ్యక్తి స్వస్థలం నార్పల మండలం బండ్లపల్లి. ప్రస్తుతం నగరంలోని అరవింద్‌నగర్‌లో ఉంటున్నారు. శివప్రకాశ్‌రెడ్డితోపాటు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం ఇందిరాగాంధీనగర్‌కు చెందిన గుండాల ప్రశాంత్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన జయరామిరెడ్డి, విజయకుమార్‌ అలియాస్‌ విక్రమ్‌ పరారీలో ఉన్నారు. ఈ నలుగురు ముఠాగా ఏర్పడి ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్సింగ్‌ (ఏపీసీఓఎస్‌)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారు. ముఠాలోని శివప్రకాశ్‌రెడ్డి, ప్రశాంత్‌బాబు ఒక్కొక్కరి నుంచి రూ.2.30 లక్షలు తీసుకొని, వారిని విజయవాడకు తీసుకెళ్లి జయరామిరెడ్డిని పరిచయం చేశారు. ఆయన అభ్యర్థులకు నకిలీ నియామక ఉత్తర్వులు అందజేసారు. నమ్మకం కలిగేలా వారి ఖాతాల్లో ఒక నెల జీతం రూ.21,500 వేశారు. జిల్లా కో-ఆర్డినేటర్‌గా విజయకుమార్‌ ఉంటారని నమ్మించారు. తర్వాత కాలయాపన చేస్తుండటంతో బాధితులకు అనుమానం వచ్చి అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వచ్చిన సమాచారం మేరకు ముఠాలో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ముఠా సభ్యులు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడ్డారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని