విశాఖ వాసి రాజమహేంద్రవరంలో అదృశ్యం

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ రాసి విశాఖకు చెందిన ఓ వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అదృశ్యమయ్యారు. రెండో పట్టణ సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.

Updated : 06 Aug 2022 06:54 IST

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ

వంతెనపై వదిలి వెళ్లిన కారు.. చంద్రశేఖర్‌

రాజమహేంద్రవరం నేరవార్తలు, పెదవాల్తేరు, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ రాసి విశాఖకు చెందిన ఓ వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అదృశ్యమయ్యారు. రెండో పట్టణ సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం వేకువ జాము నుంచి ఓ కారు రోడ్డు, రైలు వంతెనపై నిలిచి ఉండటంతో అనుమానం వచ్చి ఓ వాహనచోదకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించగా అందులో చిన్న కాగితం లభించింది. ఆర్థిక సమస్యల కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నానని, గోదావరిలో దూకేస్తున్నానని, తన భార్యకు ఈ విషయం చెప్పాలని అందులో రాశారు. కారులోని బ్యాంకు పాస్‌బుక్‌, ఇతర ఆధారాలతో ఆ వ్యక్తి విశాఖపట్నంలోని కిర్లంపూడి లే-ఔట్‌కు చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్‌(61)గా పోలీసులు గుర్తించారు. ఆయన గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారా..? మరెక్కడికైనా వెళ్లిపోయారా..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. వంతెన కింద నదిలో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అప్పుల కారణంగా చంద్రశేఖర్‌ గతంలోనూ ఓ సారి ఇలాగే చేసి తిరిగి ఇంటికి వచ్చేశారని ఆయన భార్య చెబుతున్నారని సీఐ తెలిపారు. చంద్రశేఖర్‌కు రాజకీయ, స్థిరాస్తి వ్యాపార ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఈయన హామీగా ఉండి కొందరికి అప్పులిప్పించినట్లు సమాచారం. ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు