‘ఇంజినీరింగ్‌ విద్యార్థిది హత్యే’

అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిది హత్యేనని కేసు మార్పు చేసినట్లు రెండో పట్టణ ఎస్‌.ఐ. చంద్రమోహన్‌ తెలిపారు. ఎస్‌.ఐ. కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండ తాండాకు చెందిన రెడ్డెప్పనాయక్‌ కుమారుడు ఠాగూర్‌నాయక్‌ (23)

Updated : 07 Aug 2022 06:53 IST

ఠాగూర్‌ నాయక్‌ (పాతచిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిది హత్యేనని కేసు మార్పు చేసినట్లు రెండో పట్టణ ఎస్‌.ఐ. చంద్రమోహన్‌ తెలిపారు. ఎస్‌.ఐ. కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండ తాండాకు చెందిన రెడ్డెప్పనాయక్‌ కుమారుడు ఠాగూర్‌నాయక్‌ (23) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో పండుగ కోసం ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళుతున్నానని చెప్పి మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో గత నెల 2వ తేదీన మదనపల్లె పట్టణంలోని బీకేపల్లె కాలనీ వెనుక భాగంలోని గుట్టకనుమ ప్రాంతంలో మృతి చెంది పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఆధారంగా అతనంతకు అతనే చనిపోలేదని ఎవరో చంపినట్లు నిర్ధారణ అయ్యిందని ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడి మెడచుట్టూ తీగలు ఉండటంతో తీగలతో గొంతు బిగించి ఠాగూర్‌ నాయక్‌ను హత్య చేసినట్లు అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సీఐ మురళీకృష్ణ ఆదేశానుసారం అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్పు చేశామని ఠాగూర్‌నాయక్‌ను హత్య చేసిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని