కారు బీభత్సం.. బాలుడి దుర్మరణం

ఓ యువకుడి కారు నడపాలనే అత్యుత్సాహం బాలుడి ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట కంసాలిపేటలో విషాదం నింపింది. పోలీసుల

Published : 07 Aug 2022 05:55 IST


బడ్డీ కొట్టును ఢీకొట్టిన వాహనం

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : ఓ యువకుడి కారు నడపాలనే అత్యుత్సాహం బాలుడి ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట కంసాలిపేటలో విషాదం నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు నగరం కొరిటెపాడులోని నాయుడుపేటకు చెందిన యువకుడి తన పెళ్లి కార్డులను పంచేందుకు అతని బావమరిది రాజశేఖర్‌కుమార్‌, మరో ఇద్దరితో కలిసి కంసాలిపేటలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. బంధువుల ఇంట్లో పెళ్లికార్డు ఇచ్చారు. మరొకరికి ఇచ్చేందుకు కారులో ఉన్న కార్డులను తీసుకురావాలని తాళం ఇచ్చి రాజశేఖర్‌కుమార్‌ను పంపించారు. అతను అత్యుత్సాహంతో కారు స్టార్ట్‌ చేశాడు. వాహనం గేరులో ఉండటంతో ఎదురుగా రోడ్డు పై ఆడుకుంటున్న బాలురును వేగంగా ఢీకొట్టింది. అనంతరం బడ్డీ కొట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో పదో తరగతి చదువుతున్న షేక్‌ ఛాంద్‌బాషా(షకీల్‌-15) అక్కడిక్కడే మృతి చెందాడు. షేక్‌ అజీమ్‌(13), కిషోర్‌(20)లకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు కూడా కంసాలిపేటకు చెందిన వారే. దీనిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. అప్పటికే ముగ్గురు గాయాలతో ఉన్నారని తెలిపారు. ఆసుపత్రికి తరలించేందుకు సిద్దం కాగా, షకీల్‌(15) మృతి చెందాడని చెప్పారు. మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించామన్నారు. నిందితుడి అత్యుత్సాహం కారణంగా ఈ ఘటన జరిగిందన్నారు. షకీల్‌ తల్లి షకీరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని