విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, బాలుడి మృతి

సంపును శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఇద్దరు విద్యుదాఘాతానికి బలవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దుండిగల్‌ ఎస్సై శ్రీనివాస్‌, స్థానికుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మాచినపల్లికి చెందిన గాదె జానారెడ్డి(30),

Updated : 08 Aug 2022 04:44 IST

దుండిగల్‌, న్యూస్‌టుడే: సంపును శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఇద్దరు విద్యుదాఘాతానికి బలవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దుండిగల్‌ ఎస్సై శ్రీనివాస్‌, స్థానికుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మాచినపల్లికి చెందిన గాదె జానారెడ్డి(30), మహేశ్వరి దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. మూడేళ్లుగా మల్లంపేటలోని డ్రీమ్‌వ్యాలీ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె క్రితిరెడ్డి(4) ఉండగా, ప్రస్తుతం మహేశ్వరి నిండు గర్భిణి. వైద్యులు ఈనెల 10న ప్రసవ తేదీగా తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవరు వి.రవి, దినమ్మ దంపతుల కుమారుడు భవానీ ప్రసాద్‌(11) ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం మరో బాలుడితో కలిసి డ్రీమ్‌వ్యాలీ కాలనీలో ఇళ్ల వద్దకు వెళ్లి.. సంపులు, ఇళ్లు శుభ్రం చేస్తామంటూ యాజమానులను కోరారు. జానారెడ్డి సరే అనడంతో అతనితోపాటు భవానీ ప్రసాద్‌ సంపులోకి దిగారు. సబ్‌మెర్సిబుల్‌ మోటార్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయకపోవడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. జానారెడ్డి కుమార్తె చూసి ఏడుస్తుండటంతో మహేశ్వరి పరుగున వచ్చింది. అప్పటికే భర్తతోపాటు బాలుడు విగతజీవిగా పడుండటంతో కేకలేసి స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగు విద్యుత్తు సరఫరా ఆపేసి ఇద్దరిని బయటకు తీశారు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త మృతిచెందిన విషయాన్ని భార్య మహేశ్వరికి చెప్పలేదు. భవానీ ప్రసాద్‌ అన్న సాయివినయ్‌ నాలుగేళ్ల క్రితం కుక్కకాటుతో మృతిచెందాడు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని