వైద్యం వికటించి బాలిక మృతి

ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన మండల కేంద్రం నార్పలలో మంగళవారం చోటుచేసుకుంది. బాలిక బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నార్పల గారబావి కొట్టాలకు చెందిన రామాంజనేయులు,

Updated : 10 Aug 2022 05:15 IST

చంద్రిక (పాతచిత్రం)

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన మండల కేంద్రం నార్పలలో మంగళవారం చోటుచేసుకుంది. బాలిక బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నార్పల గారబావి కొట్టాలకు చెందిన రామాంజనేయులు, గీత దంపతుల కుమార్తె చంద్రిక (15) స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక గొంతు కింద గడ్డలు రావడంతో రెండు రోజులుగా స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకుంటుంది. మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్లడంతో వైద్యుడు ఇంజక్షన్‌ ఇచ్చాడు. బాలిక ఎక్కువ అనారోగ్యానికి గురవటంతో అక్కడి వైద్యుడి సూచనల మేరకు అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స మొదలు పెట్టకముందే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యం వికటించిందని గుర్తించి బంధువులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూడు నెలల కిందట ఇలాగే వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. తరచూ ఇలాంటివి చోటుచేసుకుంటూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని