Jeevitha: నగరి కోర్టుకు హాజరైన సినీనటి జీవితారాజశేఖర్‌

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఓ కేసులో సినీ నటి జీవితా రాజశేఖర్‌ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. ఈ కోర్టు నుంచి గతంలో తనపై అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సందర్భంలో హైకోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేశారు. ప్రతివాది.. న్యాయవాది మురళీధర్‌ తప్పనిసరిగా ఆమె కోర్టుకు ప్రత్యక్షంగా

Updated : 12 Aug 2022 07:08 IST

నగరిలో కోర్టు నుంచి బయటకు వస్తున్న సినీనటి జీవితా రాజశేఖర్‌

నగరి, న్యూస్‌టుడే: ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఓ కేసులో సినీ నటి జీవితా రాజశేఖర్‌ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. ఈ కోర్టు నుంచి గతంలో తనపై అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సందర్భంలో హైకోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేశారు. ప్రతివాది.. న్యాయవాది మురళీధర్‌ తప్పనిసరిగా ఆమె కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆమె తన న్యాయవాది మురుగన్‌తో కలిసి కోర్టుకు వచ్చారు. కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ జడ్జి విష్ణువర్మకు అందించి అరెస్టు వారెంట్‌ని రద్దు చేయించుకున్నారు. ఈ కేసును సెప్టెంబరు 19కి వాయిదా వేశారని ఆమె తరఫు న్యాయవాది మురుగన్‌ తెలిపారు. జీవితకు.. గరుడవేగ చిత్రనిర్మాణం కోసం నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం మహారాజుపురంలోని సాయిశక్తి ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజు రూ.26 కోట్లు రెండు దఫాలుగా ఇచ్చినట్లు, అందుకు సంబంధించి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్సు అయినట్లు, తమకు తాకట్టు పెట్టిన స్థలాన్ని తమకు తెలియజేయకనే ఇతరులకు విక్రయించారంటూ.. హేమరాజు తమిళనాడు తిరువళ్లూరు కోర్టులో, నగరి కోర్టులో రెండు కేసులు వేశారు. ఈ కేసుకు సంబంధించి నగరి కోర్టు నుంచి జారీ చేసిన నాలుగు వారెంట్లకు జీవిత హాజరుకాకపోవడంతో, ఎన్‌ఐ యాక్ట్‌ కింద కోర్టు రెండు నెలల కిందట అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై అరెస్టు వారెంట్‌ను రద్దు చేయించుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని