మునేరు కాల్వలో ఆటో బోల్తా.. మహిళ మృతి

ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మంది గాయాలపాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వత్సవాయి మండలం పాత వేమవరానికి చెందిన వ్యవసాయ కూలీలు పెనుగంచిప్రోలులో వరి నాట్లు వేసేందుకు గురువారం ఉదయం ఆటోలో బయలుదేరారు. మునేరు కాల్వకట్టపై ప్రయాణిస్తున్న

Updated : 12 Aug 2022 06:13 IST

కాల్వలో పడిన ఆటో

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మంది గాయాలపాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వత్సవాయి మండలం పాత వేమవరానికి చెందిన వ్యవసాయ కూలీలు పెనుగంచిప్రోలులో వరి నాట్లు వేసేందుకు గురువారం ఉదయం ఆటోలో బయలుదేరారు. మునేరు కాల్వకట్టపై ప్రయాణిస్తున్న ఆటోను వెనుక వచ్చిన మరో ఆటో ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆటో కుదుపునకు గురై కాల్వలో పల్టీలు కొట్టింది. నీటిలో పడిపోయిన మహిళలంతా ఆహాకారాలు చేశారు. స్థానికులు స్పందించి వారిని బయటకు తీశారు. గుజ్జ మేరీ (45)పై ఆటో పడిపోవడంతో చాలా సేపటి వరకు ఆమెను గమనించలేకపోయారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వాహనం అందుబాటులో లేక క్షతగాత్రులను మరో ఆటోలో పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. మేరీని నందిగామ తరలించాలని ఆస్పత్రి సిబ్బంది సూచించడంతో ఆటోలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందించకుండా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన అమర్లపూడి పుష్పమ్మ, రాయల లక్ష్మి, గుత్తికొండ మాధూరి, నాగరత్నం, లింగాల రాధ, కొలిపాక నాగేంద్రం, మద్దెల జ్ఞానమ్మ, కొమ్మినేని రాములు, దుంగా ప్రభావతి, దామాల కమల, దూడగుండ్ల విజయమ్మలను మెరుగైన వైద్యం కోసం జగ్గయ్యపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామ నాయకుడు మాదల వీరయ్య చౌదరి వెంటనే స్పందించి క్షతగాత్రులకు సేవలందించారు. ఎస్సై హరిప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు