రైళ్లలో చోరీలు చేసే ఆర్‌ఎంపీ అరెస్టు

రైళ్లలో చోరీలు చేసే ఆర్‌ఎంపీ వైద్యుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీఆర్పీ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated : 13 Aug 2022 06:30 IST


నిందితుడి వివరాలు తెలుపుతున్న జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్‌ సీఐ రామయ్య, ఎస్సైలు 

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రైళ్లలో చోరీలు చేసే ఆర్‌ఎంపీ వైద్యుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీఆర్పీ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపల్లెకు చెందిన శ్రీనివాసరావు గత నెల 28వ తేదీన కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. గుంటూరుకు చేరుకునేప్పటికి అతని బ్యాగ్‌ కనిపించలేదు. బ్యాగ్‌లో రూ. 8 లక్షల నగదు ఉందని, ఎవరో అపహరించారని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ గంగా వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. ఈక్రమంలో శుక్రవారం రైల్వేస్టేషన్‌లోని 3వ ప్లాట్‌ఫారంపై జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్‌ సీఐ రామయ్య, ఎస్సైలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబులు ఎంఎస్‌కె రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీసీలు వలి, సుభాని, సాంబశివరావు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసిన ఓ వ్యక్తి బ్యాగ్‌ తగిలించుకొని పరుగుపెట్టడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. బాపట్ల జిల్లా, భట్టిప్రోలుకు చెందిన తన పేరు ప్రవీణ్‌ అని ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తుంటానని పోలీసులకు తెలిపాడు. అతని సంచిని పరిశీలించగా రూ. 4 లక్షల నగదు లభించింది. జల్సాలకు అలవాటుపడి దొంగతనం చేసినట్లు తెలిపాడని సీఐ చెప్పారు. 28వ తేదీ రేపల్లె నుంచి గుంటూరు వస్తున్న క్రమంలో రైలులో ప్రయాణికుడు శ్రీనివాసరావుకు చెందిన బ్యాగ్‌ అపహరించి రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు నిందితుడి అంగీకరించాడని సీఐ తెలిపారు. మిగిలిన డబ్బులు భట్టిప్రోలులో దాచేందుకు వెళ్తున్న క్రమంలో అరెస్టు చేశామన్నారు. రూ. 4 లక్షలు జప్తు చేశామని సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని