చోరీకి వచ్చి.. ఏటీఎంకు నిప్పు

అనంతపురం నగరం నడిబొడ్డున ఓ ఏటీఎం కేంద్రంలో చోరీకి యంత్నించిన దొంగలు యంత్రానికి నిప్పు పెట్టారు. స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్రవేశించారు. అందులో ఉన్న రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టడానికి

Updated : 14 Aug 2022 04:37 IST

కేంద్రంలో యంత్రానికి నిప్పు పెడుతున్న దొంగ

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరం నడిబొడ్డున ఓ ఏటీఎం కేంద్రంలో చోరీకి యంత్నించిన దొంగలు యంత్రానికి నిప్పు పెట్టారు. స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్రవేశించారు. అందులో ఉన్న రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టడానికి యత్నించారు. ఫలితం లేక పోవడంతో దుండగులు ఓ యంత్రానికి నిప్పు పెట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. కేంద్రం నుంచి మంటలు వస్తున్న విషయాన్ని అటుగా వెళ్తున్న కాలేషావలి అనే వ్యక్తి డయల్‌ 100, ఫైర్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఏడీఎఫ్‌వో అశ్వర్థ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సమాచారం తెలుసుకున్న బ్యాంకు అధికారులు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సమీపంలోని దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకున్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిప్పుపెట్టిన తర్వాత దుండగులు ఆర్ట్స్‌ కళాశాల వసతిగృహం వైపు వెళ్లినట్లు గుర్తించారు. నగరంలో నైట్‌బీట్‌ నిర్వహిస్తున్న పోలీసులు హైఅలర్ట్‌ యాప్‌ ద్వారా అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. దొంగల ఆచూకీ లభించలేదు. సాంకేతిక విభాగ బృందం వస్తే తప్ప, నగదు అపహరణకు గురయ్యిందా? లేదా? అనే విషయాలు నిర్ధారణకు రాలేమని బ్యాంకు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని