దిన్నెదేవరపాడువాసి దారుణహత్య

దిన్నెదేవరపాడుకు చెందిన ఓ వ్యక్తి కోడుమూరులో దారుణ హత్యకు గురయ్యారు. తల్లిని చంపాడన్న నెపంతో కొడుకే అతణ్ని హతమార్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

Updated : 15 Aug 2022 04:26 IST

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: దిన్నెదేవరపాడుకు చెందిన ఓ వ్యక్తి కోడుమూరులో దారుణ హత్యకు గురయ్యారు. తల్లిని చంపాడన్న నెపంతో కొడుకే అతణ్ని హతమార్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన బోయ ఎర్రపుల్లయ్య(66) కోడుమూరులో ఉండే తన కుమార్తెను చూసేందుకు గురువారం వచ్చారు. ఆదివారం హంద్రీనది వంతెనకు సమీపంలోని గ్రీన్‌సిటీ గార్డెన్‌లో ఆయన రక్తపుమడుగులో కనిపించాడు. గొంతుకోసి హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమార్తె ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కోడుమూరు సీఐ శ్రీధర్‌ తెలిపారు. ఎర్రపుల్లయ్య ఈ ఏడాది ఏప్రిల్‌ 3న తన భార్యను రోకలిబండతో బాది దారుణంగా హత్యచేశాడన్న అభియోగంపై జైలుపాలై ఇటీవలే విడుదలయ్యాడు. తల్లిని హతమార్చాడనే కోపంతో కుమారుడు బ్రహ్మయ్యే ఆయన్ను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడని, అందుకే పరారీలో ఉన్నట్లు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని