రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి... తల్లిదండ్రులకు గాయాలు

తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి కావడి మొక్కు చెల్లించి కారులో వస్తున్న ఒకే కుటుంబసభ్యులు షోలింగర్‌ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురుకి గాయాలవగా.. ఒకరు మరణించారు. గాయపడిన వారు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స

Updated : 16 Aug 2022 05:04 IST

తిరుత్తణిలో కావడి మొక్కు చెల్లించి వస్తుండగా ఘటన

రవితేజ (పాతచిత్రం)

బంగారుపాళ్యం: తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి కావడి మొక్కు చెల్లించి కారులో వస్తున్న ఒకే కుటుంబసభ్యులు షోలింగర్‌ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురుకి గాయాలవగా.. ఒకరు మరణించారు. గాయపడిన వారు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెదేపా మండల మాజీ కార్యదర్శి చంద్రశేఖర్‌ తెలిపిన సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివెంకటగిరి గ్రామానికి జగదీష్‌, అతడి భార్య మాధవి, కుమారుడు రవితేజ, కుమారై యామిని, జగదీష్‌ చెల్లెలు వాణి, ఆమె కుమారై ప్రియ సోమవారం తమిళనాడులోని తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కు చెల్లించేందుకు కారులో పయనమయ్యారు. మొక్కు చెల్లించి తిరిగి వస్తుండగా షోలింగర్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం నుంచి ప్రమాదాన్ని తప్పించబోయి పక్కకు తిప్పడంతో కారు అదుపు తప్పి రహదారిలో కల్వర్టును ఢీకొంది. ప్రమాదంలో  రవితేజ(21) మృతి చెందాడు. అతడు హైదరాబాదు నుంచి స్వామివారి మొక్కుచెల్లించడానికి వచ్చాడు. అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుడి తండ్రి జగదీష్‌, తల్లి మాధవి, చెల్లెలు యామిని, అత్త వాణి, ఆమె కుమారై ప్రియకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మొగిలి వెంకటగిరి గ్రామంలో విషదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని