స్వాతంత్య్ర వేడుకలకు హాజరై వెళ్తూ.. మహిళా ఉద్యోగి మృతి

స్వాతంత్య్ర వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఉద్యోగి దుర్మరణం పాలైన సంఘటన అంతర్గాం మండలం కుందనపల్లి ఐవోసీీఏల్‌ ఏరియా వద్ద జరిగింది. రాజీవ్‌ రహదారిపై సోమవారం

Updated : 16 Aug 2022 07:02 IST

వేడుకల్లో పి.మల్లమ్మ

అంతర్గాం, న్యూస్‌టుడే : స్వాతంత్య్ర వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఉద్యోగి దుర్మరణం పాలైన సంఘటన అంతర్గాం మండలం కుందనపల్లి ఐవోసీీఏల్‌ ఏరియా వద్ద జరిగింది. రాజీవ్‌ రహదారిపై సోమవారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో పెద్దపల్లి అందుగులపల్లికి చెందిన పుట్ట మల్లమ్మ(57) మృతి చెందింది. మల్లమ్మ గోదావరిఖని మహిళా జూనియర్‌ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. కళాశాలలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. పెద్దపల్లికి చెందిన దామరకొండ శంకర్‌ ద్విచక్ర వాహనంపై తిరిగి గోదావరిఖని నుంచి పెద్దపల్లికి బయల్దేరారు. కుందనపల్లి ఐవోసీీఎల్‌ ఏరియా దాటాక వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరూ కిందపడ్డారు. మల్లమ్మ తలకు బలమైన గాయమవగా కుడిచెయ్యి విరిగింది. అదే కారులో ఆమెను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మల్లమ్మకు ఐదుగురు కుమార్తెలు.. కారు డ్రైవర్‌ చిందం వెంకటరావుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై బి.సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని