వేములవాడలో భారీ చోరీ

వేములవాడ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలో పెద్ద ఎత్తున చోరీ జరగడం సోమవారం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసం

Updated : 16 Aug 2022 06:19 IST

35 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.80 లక్షల నగదు అపహరణ

వస్తువులను చిందర వందర చేసిన దృశ్యం

వేములవాడ, న్యూస్‌టడే: వేములవాడ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలో పెద్ద ఎత్తున చోరీ జరగడం సోమవారం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఏనుగుల మనోహర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు తాళం తీసి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి బాధితులు లబోదిబోమన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీం సిబ్బంది ఆధారాల కోసం వెతికారు. దాదాపు 35 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి వస్తువులు, రూ.2.80 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. చోరీ జరిగిన తీరుపై పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. అర్ధరాత్రి ఓ మహిళ వర్షంలో గొడుగు పట్టుకొని వచ్చి ఇంటి తాళం పగులగొట్టి దొంగతనం చేసి చాకచక్యంగా వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు మనోహర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని