మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

చర్లలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సీఐ అశోక్‌ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. వీరాపురం నుంచి కుదునూరు వస్తున్న ఇద్దరు అనుమానితులను సీఆర్పీఎఫ్‌ 141 బెటాలియన్‌ పోలీసులు, స్థానిక పోలీసులు పట్టుకున్నారు.

Updated : 17 Aug 2022 04:23 IST


మిలీషియా సభ్యుల అరెస్టు చూపుతున్న సీఐ అశోక్‌, చిత్రంలో ఎస్సైలు రాజువర్మ, వెంకటప్పయ్య

చర్ల, న్యూస్‌టుడే: చర్లలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సీఐ అశోక్‌ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. వీరాపురం నుంచి కుదునూరు వస్తున్న ఇద్దరు అనుమానితులను సీఆర్పీఎఫ్‌ 141 బెటాలియన్‌ పోలీసులు, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వీరి వెంట ఉన్న ఇంకొందరు పరారైనట్లు సీఐ తెలిపారు. పట్టుబడ్డ వీరిద్దరిదీ కొరుక్కోడ్‌పాడ్‌గా గుర్తించారు. 7 కార్డెక్స్‌ వైర్లు, నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 15 కరపత్రాలు, 3 బ్యానర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. పట్టుబడిన వారిలో రవ్వా కోశయ్య అలియాస్‌ కోసా మూడేళ్లుగా మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నారు. సోడి మూకయ్య ఏడాదిగా మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్‌, అరుణ, రజిత ఆదేశాలతో ఈ ఇద్దరితోపాటు మరికొందరు సభ్యులు వీరాపురం మీదుగా వస్తుండగా కుదునూరు వద్ద తనిఖీల్లో పట్టుబడ్డట్లు తెలిపారు. ఎస్సైలు రాజువర్మ, వెంకటప్పయ్య పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
చర్ల(దుమ్ముగూడెం), న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి రాయిగుండం-తార్లగుండం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. డీఆర్జీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టు దళాలు నేరుగా భద్రతా బలగాలపై కాల్పులకు దిగాయి. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని పారిపోయారు. కొంతమంది మావోయిస్టులు తీవ్ర గాయాలపాలై ఉంటారని సుక్మా ఎస్పీ సునీల్‌శర్మ తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని