ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరిట రూ.3.47 లక్షల మోసం

ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడి రూ.లక్షల్లో మోసపోయిన సంఘటనపై వనపర్తి పట్టణ పోలీసు ఠాణాలో కేసు నమోదయ్యింది. ఎస్సై యుగంధర్‌రెడ్డి కథనం ప్రకారం... వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడీఆర్‌నగర్‌ కాలనీకి

Updated : 18 Aug 2022 06:20 IST

వనపర్తి, న్యూస్‌టుడే : ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడి రూ.లక్షల్లో మోసపోయిన సంఘటనపై వనపర్తి పట్టణ పోలీసు ఠాణాలో కేసు నమోదయ్యింది. ఎస్సై యుగంధర్‌రెడ్డి కథనం ప్రకారం... వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడీఆర్‌నగర్‌ కాలనీకి చెందిన మహేశ్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో డబ్బులు కడితే రెట్టింపు మొత్తం వస్తాయన్న ప్రచారానికి ఆకర్షితుడై 2021 జూన్‌ నుంచి కొద్ది మొత్తం డబ్బు జమ చేస్తూ వచ్చారు. నిర్వాహకులు కూడా జమచేసిన దానికి రెండింతలు అతని ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. అలా మొదట్లో రూ.వెయ్యి, రెండు, మూడు వేల చొప్పున జమచేసి రెండింతలు పొందిన ఆయన తరవాత ఒకేసారి రూ.60 వేలు వేయగా ఒక్క రూపాయి జమకాలేదు. వేసిన డబ్బులు రెండింతలు కావాలంటే గేమ్స్‌ ఆడి సంపాదించుకోవాలని ఆన్‌లైన్‌ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా గేమ్స్‌ ఆడుతూ దాదాపు ఏడాది కాలంలో మొత్తం రూ.3,47,716లు చెల్లించాడు. అయినా అతనికేమాత్రం డబ్బులు రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన మహేశ్‌ బుధవారం పట్టణ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts