Published : 18 Aug 2022 10:40 IST

Crime News: దారుణం.. రాత్రి భోజనం పెట్టలేదని భార్యను చంపేశాడు!

మార్కాపురం గ్రామీణం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జమునపల్లె చెంచు కాలనీలో భార్యను భర్త హతమార్చాడు. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంచుకాలనీకి చెందిన దాసరి చిన్న అంకాలు బుధవారం రాత్రి భార్య బసవమ్మ(35)తో గొడవపడ్డాడు. భోజనం పెట్టలేదనే కారణంతో మద్యం మత్తులో తెల్లవారుజామున ఆమెపై కర్రతో దాడి చేశాడు. ఆ సమయంలో కర్ర బసవమ్మ గుండెల్లో గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని