బాలుడిని బలిగొన్న మురుగు గుంత

గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంత మూడేళ్ల బాలుడిని బలిగొంది. అప్పటి వరకు ఆడుకుంటూ  ఉన్న బాలుడు అందులో పడి మృత్యువాత పడ్డాడు. బాధితుల కథనం మేరకు.. మద్దూరు మండలంలోని ఎక్కమెడ్‌ గ్రామానికి చెందిన కాశమ్మ, మొగులప్ప

Updated : 19 Aug 2022 06:17 IST

మద్దూరు, న్యూస్‌టుడే : గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంత మూడేళ్ల బాలుడిని బలిగొంది. అప్పటి వరకు ఆడుకుంటూ  ఉన్న బాలుడు అందులో పడి మృత్యువాత పడ్డాడు. బాధితుల కథనం మేరకు.. మద్దూరు మండలంలోని ఎక్కమెడ్‌ గ్రామానికి చెందిన కాశమ్మ, మొగులప్ప దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కాశమ్మ మొహర్రం సందర్భంగా పిల్లలతో కలిసి పుట్టినిలైన నిడ్జింతకు వచ్చారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఆమె ఇంట్లో పని చేస్తుండగా.. చిన్న కుమారుడు విష్ణు (3) ఆడుకుంటూ ఇంటికి సమీపంలో గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంతలో పడిపోయాడు. కాసేపటి తరవాత కుమారుడు కనిపించడం లేదని కాశమ్మ వెతుకుతుండగా.. మురుగు గుంతలో పడిఉండటం గమనించారు. బయటకు తీసి మద్దూరు పీహెచ్‌సీకి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిడ్జింత గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంత ప్రమాదకరంగా ఉంది. రెండేళ్ల కిందట 45 ఏళ్ల వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు దీనిలోపడి మృతి చెందాడు. గుంతను పూడ్చాలని అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని, ఇకనైనా పూడ్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని