పట్టపగలే చోరీ

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది.  దుండగులు సుమారు రూ.8.50 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పడంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల

Updated : 19 Aug 2022 06:18 IST

రూ.8.50 లక్షల నగదు అపహరణ

ఆత్మకూర్‌, న్యూస్‌టుడే : వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది.  దుండగులు సుమారు రూ.8.50 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పడంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారి గొల్ల కాటె గట్టు గురువారం ఇంటి పనిపై ఆత్మకూరుకు, భార్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్లారు. ఇద్దరు కుమార్తెలు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆత్మకూరులో ప్రదర్శించిన గాంధీ సినిమా చూసేందుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగా.. తాళం విరగ్గొట్టి ఉండటాన్ని గమనించారు. చరవాణి ద్వారా తండ్రి గట్టుకు సమాచారం ఇచ్చారు. హటాహుటిన ఇంటికి వచ్చి పరిశీలించగా.. బీరువాలో దాచిన రూ.8.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. గొర్రెల వ్యాపారం కోసం నగదు తెచ్చి పెట్టుకున్నట్లు చెప్పారు. బాధితుడి సమాచారంతో సీఐ రత్నం, ఎస్‌ఐ రాఘవేంద్ర గ్రామానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.

రైతు ఇంట్లో 2 తులాల బంగారం, రూ.లక్ష నగదు..

ఆత్మకూర్‌ : పురపాలిక పరిధిలోని ఖానాపురం గ్రామంలో గురువారం సాయత్రం గుర్తు తెలియని వ్యక్తులు రైతు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రైతు రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనులకు వెళ్లగా, కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి మధ్యాహ్నం భోజనం అనంతరం ఆత్మకూరులోని ఎరువుల దుకాణానికి వెళ్లారు. కళ్లు సరిగా కనిపించని రామకృష్ణారెడ్డి తల్లి రంగమ్మ ఇంట్లో పడుకొని ఉండగా.. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం రామకృష్ణారెడ్డి ఇంటికి రాగా.. బీరువా తెరిచి ఉండటం గమనించి వెళ్లి పరిశీలించగా.. అందులో ఉంచిన రూ.లక్ష నగదు, రెండు తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఎస్‌ఐ రాఘవేంద్ర గ్రామానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. పోలీసు జాగిలం, వేలిముద్ర నిపుణులు ఇక్కడ కూడా ఆధారాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని