జిల్లా అధికారినని చెప్పి టోకరా

‘ఏవండోయ్‌.. నేను జిల్లా అధికారిని.. మీకు రూ.2 లక్షలు విలువైన చెక్కు వచ్చింది. నగదుగా మార్చుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది’ అని  కడియం మండలం వేమగిరికి చెందిన మహిళను ఓ వ్యక్తి బురుడీ కొట్టించాడు. వివరాల్లోకెళితే..గ్రామానికి చెందిన నూకల రమాదేవి భర్త ఇటీవల

Updated : 19 Aug 2022 06:35 IST

నకిలీ చెక్కును చూపుతున్న రమాదేవి

కడియం, న్యూస్‌టుడే: ‘ఏవండోయ్‌.. నేను జిల్లా అధికారిని.. మీకు రూ.2 లక్షలు విలువైన చెక్కు వచ్చింది. నగదుగా మార్చుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది’ అని  కడియం మండలం వేమగిరికి చెందిన మహిళను ఓ వ్యక్తి బురుడీ కొట్టించాడు. వివరాల్లోకెళితే..గ్రామానికి చెందిన నూకల రమాదేవి భర్త ఇటీవల మృతిచెందారు. ఆమె ఇంటి స్థలం, వితంతు పింఛను తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత పొందలేదు. ఈ విషయం తెలుసుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె దరఖాస్త్తులతో పాటు పూర్తి ఆధారాలు సేకరించాడు. గురువారం ఆమె ఉంటున్న ఇంటికి వచ్చి తాను జిల్లా అధికారినని, భర్తకు సంబంధించి జగనన్న భీమా కింద రూ.2.75 లక్షల విలువచేసే చెక్కు మంజూరైందని నమ్మబలికాడు. ప్రభుత్వం నేరుగా పంపించడం వల్ల రూ.25 వేలు ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తన వద్ద అంత మొత్తం లేదని, చెక్కు మార్చిన తర్వాత డబ్బు ఇస్తానని ఆమె ప్రాధేయపడినా ఒప్పుకోలేదు. చేసేదిలేక తన వద్ద ఉన్న రూ.రెండు వేలు ఇచ్చింది. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఖాళీస్థలం వద్దకు ఆమెను తీసుకువెళ్లి స్థలం మంజూరైందంటూ ఆమె ఫోటో తీసుకున్నాడు. రెండు రోజుల్లో పట్టాతో వస్తా అని ఉడాయించాడు. తీరా ఆ చెక్కు నకిలీది అని తేలడంతో ఆమె లబోదిబోమంటోంది. ఇదే తరహాలో ఇటీవల గ్రామానికి చెందిన మరో మహిళ గుర్తుతెలియని వ్యక్తికి 1,400 ఇచ్చి మోసపోయారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సంబంధిత వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా అందజేస్తున్నామని, ప్రజలు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కడియం ఎంపీడీవో కె.రత్నకుమారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని