చిన్ననాటి స్నేహితులు.. చోరీల్లో సిద్ధహస్తులు

వారిద్దరూ చిన్న నాటి స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి చోరీల బాటపట్టారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌, సంగారెడ్డి జిల్లా పరిధిలో 23 చోట్ల బైకుల చోరీకి పాల్పడ్డారు.

Updated : 24 Sep 2022 05:47 IST


స్వాధీనం చేసుకున్న వాహనాలతో డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ కృష్ణప్రసాద్‌, సీఐ తిరుపతిరావు, డీఐ కాంతారెడ్డి

మియాపూర్‌, న్యూస్‌టుడే: వారిద్దరూ చిన్న నాటి స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి చోరీల బాటపట్టారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌, సంగారెడ్డి జిల్లా పరిధిలో 23 చోట్ల బైకుల చోరీకి పాల్పడ్డారు. వారం క్రితం మియాపూర్‌ పరిధిలో ఒక బైకు చోరీ చేస్తూ పోలీసుల నిఘాకు చిక్కారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వివరాలను మియాపూర్‌ ఠాణాలో శుక్రవారం మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. పశ్చిమబంగకు చెందిన రాజు రహమాన్‌, ఎమన్‌హక్యుమొండల్‌ ఇద్దరూ స్నేహితులు. చందానగర్‌లో నివసిస్తున్నారు. కొంతకాలం డెలివరీ బాయ్స్‌గా పనిచేశారు. జల్సాలకు అలవాటుపడ్డారు. యూట్యూబ్‌లో బైకులను చోరీ చేసే విధానాన్ని తెలుసుకున్నారు. చోరీ చేసిన బైకుపై మియాపూర్‌ వద్ద హైవేలో వెళ్తూ పోలీసుల కంటపడ్డారు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతావి స్క్రాప్‌ కింద విక్రయించినట్లు గుర్తించారు. సీఐ తిరుపతిరావు, డీఐ కాంతారెడ్డి, ఎస్సై జగదీశ్వర్‌, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని