అందిపుచ్చుకొని.. అధిక ధరలకు అమ్మేసి

ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకుంటే.. బెట్టింగ్‌ బాబులు సంబరాలు చేసుకున్నారు. సిరీస్‌ చివరి మ్యాచ్‌.. విజేతను తేల్చే కీలక పోరు కావడంతో భారీయెత్తున బెట్టింగ్‌ జరిగింది.

Updated : 26 Sep 2022 04:45 IST

ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసిన వెంకటేష్‌, దయాకర్‌, అరుణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకుంటే.. బెట్టింగ్‌ బాబులు సంబరాలు చేసుకున్నారు. సిరీస్‌ చివరి మ్యాచ్‌.. విజేతను తేల్చే కీలక పోరు కావడంతో భారీయెత్తున బెట్టింగ్‌ జరిగింది. రూ.వెయ్యికి రూ.వెయ్యి చొప్పున దందా నడిచింది. పంటర్లు, బుకీలు రెండ్రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో రూ.కోట్లలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం. కొందరు పంటర్లు శివార్లలోని ఫాంహౌస్‌లకు ఆదివారం మధ్యాహ్నమే చేరుకుని మద్యం సహా అన్ని వసతులు సమకూర్చుకున్నారు. రూ.లక్షల్లో పందాలు కాశారు.

15 రెట్ల ధర.. మ్యాచ్‌ టికెట్ల బ్లాక్‌ దందా రూ.లక్షల్లో జరిగింది. రూ.1250 విలువైన టిక్కెట్‌ రూ.20 వేలు పలికింది. రూ.850ది రూ.11వేలకు విక్రయించారు. వేల టికెట్లు బ్లాక్‌లో అమ్ముడుపోయాయి. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్న ఆరుగుర్ని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.

100కుపైనే యాప్‌లు.. పోలీసుల నిఘా నేపథ్యంలో ఆధారాలు దొరక్కుండా పంటర్లు, నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పందెం కాయాలంటే ముందుగా పాన్‌కార్డు, బ్యాంకు ఖాతానంబరు నమోదుచేయాలి. కొంత నగదు జమచేయాలి. ప్రత్యక్షంగా నిర్వాహకులతో కలిసి పాల్గొన్నా గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు. నగదు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని