మరణంలోనూ వీడని స్నేహబంధం

స్నేహితుడికి సహకరించడానికి వచ్చి ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఇటీవల దుబాయి నుంచి రాగా మరొకరు ఇంటి వద్దే చిన్న దుకాణాన్ని

Updated : 28 Sep 2022 05:41 IST

ఇద్దరు యువకుల మృతితో విషాదం
చికిత్స పొందుతున్న మరో ఇద్దరు

 

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: స్నేహితుడికి సహకరించడానికి వచ్చి ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఇటీవల దుబాయి నుంచి రాగా మరొకరు ఇంటి వద్దే చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు. మెట్పల్లి పట్టణంలో విద్యుదాఘాతం ఘటనలో ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన కనక వికాస్‌(25), బైండ్ల వినీత్‌(26)లు మృతి చెందగా రంజిత్‌, ఉదయ్‌లకు స్వల్పగాయాలయ్యాయి.

విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సామగ్రి సర్దుదామని...
ఇబ్రహీంపట్నం మండలం ‘డబ్బా గ్రామానికి చెందిన బోగ సంతోష్‌ మెట్పల్లి పట్టణంలో ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. కొత్తగా అద్దెకు తీసుకున్న గదిలోకి షాపు మార్చుతుండడంతో గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితులు నలుగురు సహకరించడానికి మెట్పల్లికి  మంగళవారం వచ్చారు. షాపుపై ఉన్న బోర్డును తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో వికాస్‌, వినీత్‌లు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు స్నేహితులకు స్వల్ప గాయలు కాగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి పంపించారు. జగ్గయ్య, దేవమ్మలకు ముగ్గురు కుమారులు. ఇందులో వికాస్‌ రెండోవాడు. ఏడాది క్రితం ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. ఇటీవల వినాయక నవరాత్రోత్సవాల సమయంలో దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
 సంజీవ్‌, రాజ్యలక్ష్మిల ముగ్గురు కుమారుల్లో వినీత్‌ రెండోవాడు. గ్రామంలో చిన్నదుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవలే నిశ్చితార్థమైంది. స్నేహితుడికి సాయం చేయడానికి వెళ్లిన కుమారుల మరణించారన్న వార్తవిని వారి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెట్పల్లికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మెట్‌పల్లి సీఐ శ్రీను, ఎస్సై మన్మధరావులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను సామాజికి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. స్వల్ప గాయాలపాలైన ఇద్దరిని చికిత్స కోసం జగిత్యాల ఆసుపత్రికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని