Crime News: నల్లనిదానివంటూ భర్త అవహేళన.. గొడ్డలితో హతమార్చిన భార్య

నువ్వు నల్లగా ఉంటావు అంటూ భర్త పదేపదే తనను అవహేళన చేస్తుండటాన్ని ఆ భార్య

Updated : 28 Sep 2022 10:18 IST

దుర్గ్‌(ఛత్తీస్‌గఢ్‌): నువ్వు నల్లగా ఉంటావు అంటూ భర్త పదేపదే తనను అవహేళన చేస్తుండటాన్ని ఆ భార్య భరించలేకపోయింది. తాళికట్టిన పెనిమిటే అయినా అతన్ని గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలేశ్వర్‌ గ్రామానికి చెందిన అనంత్‌ సాన్‌వాని(40) నల్లగా ఉన్న తన భార్య సంగీతను అసహ్యంగా పిలిచేవాడు. ఆమె శరీరఛాయపై అవహేళన చేసేవాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఉద్రేకం పట్టలేని సంగీత తన భర్తపై ఇంట్లోని గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే చంపేసింది. అంతేకాకుండా అతడి జననాంగాలను కోసేసింది. సోమవారం ఉదయం తన భర్తను ఎవరో హతమార్చారంటూ గ్రామస్థులకు చెప్పింది. అయితే పోలీసు విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని