రోజువారీ అంశాలే.. మాయగాళ్ల అస్త్రాలు

మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌కాల్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా సిమ్‌కార్డులను లాటరీ తీస్తే అతడి నంబర్‌కు రూ.25లక్షలు వచ్చాయంటూ నమ్మకం కలిగించారు. సొమ్ము జమచేసేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.4.5లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

Updated : 01 Oct 2022 05:33 IST

ఈనాడు, హైదరాబాద్‌

* మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌కాల్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా సిమ్‌కార్డులను లాటరీ తీస్తే అతడి నంబర్‌కు రూ.25లక్షలు వచ్చాయంటూ నమ్మకం కలిగించారు. సొమ్ము జమచేసేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.4.5లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

* ముషీరాబాద్‌లో ఓ వయోధికుడికి విద్యుత్తు బిల్లు బకాయి చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామంటూ భయపెట్టారు. మొబైల్‌కు లింకు పంపి ఖాతాలోని రూ.లక్ష స్వాహా చేశారు.

* ప్రస్తుతం కొత్త తరహాలో రూ.లక్షల విలువైన ఐఫోన్‌లు రూ.2500-3000కే గెలుచుకున్నారంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలా దైనందిన జీవితంలో నిత్యావసరంగా మారిన సేవలను అందిస్తామనే ముసుగులో సైబర్‌ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 8 నెలల్లో సైబర్‌ మోసాలపై 4,500-5000 కేసులు నమోదైనట్టు అంచనా. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 40-50శాతం కేసులు పెరిగినట్టు భావిస్తున్నారు.  

డబ్బు వస్తుందని ఉచ్చులో చిక్కి..

అవతలి వారి భయం, ఆశను సొమ్ము చేసుకోవటమే మోసగాళ్ల లక్ష్యమంటున్నారు నగర సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌. తేలిక మార్గంలో డబ్బు వస్తుందనే భ్రమలో ఉన్న ఎక్కువ మంది ఉచ్చులో పడుతున్నారని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ జి.శ్రీధర్‌ తెలిపారు. మోసపోయినట్టు గుర్తించగానే 100, 1930 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని