పెద్దవాగులో అక్కాచెల్లెళ్ల గల్లంతు

స్నానం చేద్దామని వాగులో దిగిన అక్కాచెల్లెళ్లు గల్లంతైన ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 02 Oct 2022 06:11 IST

ఒకరి మృతదేహం లభ్యం.. మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు


గల్లంతయిన మల్లీశ్వరి                       ఆర్తి మృతదేహం

కెరమెరి, న్యూస్‌టుడే: స్నానం చేద్దామని వాగులో దిగిన అక్కాచెల్లెళ్లు గల్లంతైన ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం దేవాపూర్‌(జైరాంగూడ)కు చెందిన గౌతమ్‌- గోదావరి దంపతుల కుమార్తెలు ఆర్తీ(16), మల్లీశ్వరీ(8) శనివారం సమీప బంధువు(పిన్నీ)తో కలిసి గ్రామ సమీనంలో వాగులో దుస్తులు ఉతకడానికి వెళ్లారు. పిన్నీ దుస్తులు ఉతుకుతుండగా అక్కాచెల్లెలు నీరు తక్కువగా ఉన్నచోట స్నానం చేద్దామని వాగులో దిగారు. ఈక్రమంలో చెల్లి ఒక్కసారిగా లోతు ఉన్న వైపు వెళ్లి మునుగుతుండటంతో కాపడటానికి వెళ్లిన అక్క కూడా గల్లంతైంది. వారి వెంట వచ్చిన బంధువుకు కూడా ఈత రాకపోవడంతో ఒడ్డునే రోదిస్తూ ఉండిపోయింది. స్థానికుల సాయంతో వెతకగా అక్క మృతదేహం లభించింది. చెల్లి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆరుగురు కుమార్తెలే..
గౌతమ్‌- గోదావరి దంపతులది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. పైగా వారికి ఆరుగురు ఆడ పిల్లలే. అందులో ఇద్దరికి వివాహాలు అయ్యాయి. మూడు, నాలుగో సంతానం ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని