గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు ధ్వంసం

నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని ఆడెపు రమేశ్‌ ఇంట్లో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఆరుబయట ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాదంలో ఇంటి పైకప్పు ధ్వంసం కావడంతో పాటు సామగ్రి చెల్లాచెదురుగా పడింది. ప్రాణనష్టం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated : 03 Oct 2022 06:02 IST

చెల్లాచెదురుగా పడిపోయిన సామగ్రి

నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని ఆడెపు రమేశ్‌ ఇంట్లో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఆరుబయట ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాదంలో ఇంటి పైకప్పు ధ్వంసం కావడంతో పాటు సామగ్రి చెల్లాచెదురుగా పడింది. ప్రాణనష్టం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రూ.5 లక్షలు ఆస్తి నష్టపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.    

దెబ్బతిన్న ఇంటి పైకప్పు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని