పురుగుల మందు పిచికారీతో అస్వస్థత

పురుగుల మందు పిచికారీ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన కిష్టాపూర్‌లో చోటుచేసుకొంది.హెడ్‌కానిస్టేబుల్‌ నంద తెలిపిన వివరాల ప్రకారం..కిష్టాపూర్‌కు చెందిన నీరడి పోశెట్టి (31)  వ్యవసాయ కూలి.

Updated : 03 Oct 2022 06:00 IST

చికిత్స పొందుతూ మృతి

నీరడి పోశెట్టి

బీర్కూర్‌, న్యూస్‌టుడే: పురుగుల మందు పిచికారీ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన కిష్టాపూర్‌లో చోటుచేసుకొంది.హెడ్‌కానిస్టేబుల్‌ నంద తెలిపిన వివరాల ప్రకారం..కిష్టాపూర్‌కు చెందిన నీరడి పోశెట్టి (31)  వ్యవసాయ కూలి. గత నెల 29న గంగారాం పొలానికెళ్లి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా తుంపరలు ముఖం, శరీరంపై పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని తొలుత బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి , అక్కడి నుంచి నిజామాబాద్‌  తరలించారు. శనివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం పంచనామా చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలున్నారు.భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని