మాట కలిపి.. మాయచేసి

స్థానికులతో మాటలు కలుపుతాడు. వారి పనుల్లో సాయం చేస్తాడు. అందరూ నమ్మాక ఇంట్లోకి వెళ్లి దొరికింది దోచేస్తాడు. సాలూరులో ఇలా మూడుసార్లు దొంగతనం చేసిన నిందితుడ్ని పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐ సీహెచ్‌.శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated : 05 Oct 2022 05:46 IST

చోరీల నిందితుడి అరెస్టు

మాట కలిపి.. మాయచేసి వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు

సాలూరు, న్యూస్‌టుడే: స్థానికులతో మాటలు కలుపుతాడు. వారి పనుల్లో సాయం చేస్తాడు. అందరూ నమ్మాక ఇంట్లోకి వెళ్లి దొరికింది దోచేస్తాడు. సాలూరులో ఇలా మూడుసార్లు దొంగతనం చేసిన నిందితుడ్ని పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐ సీహెచ్‌.శ్రీనివాసరావు వెల్లడించారు. గతనెల 6న కొంకివీధి, 27న బోనుమహంతివీధి, సోమవారం రాత్రి నెయ్యిలవీధుల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో పాత నేరస్థులపై నిఘా పెట్టిన పోలీసులు పట్టణంలోని చిన్నవీధికి చెందిన శంబాన రాంబాబు(గాంధీ) కదలికలపై దృష్టిసారించారు. కొన్నిరోజులుగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగిలించిన నగదు, ఆభరణాలు అతని వద్దే ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు 38.02 గ్రాముల బంగారం కొంత సొమ్ము, 1258 గ్రా. వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారన్నారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ నారాయణరావు, సిబ్బందిని ఆయన అభినందించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts