నకిలీ ఆర్సీ తయారీ ముఠా అరెస్ట్‌

వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ముఠా సభ్యులను శంషాబాద్‌ పోలీసులు గురువారం కటకటాల్లోకి నెట్టారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న రెండు ట్రక్కులు, నకిలీ ఆర్సీలు, మూడు పోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 07 Oct 2022 04:49 IST

షేక్‌ అక్రమ్‌        అర్షద్‌ సయ్యద్‌ ఇక్బాల్‌    మోహియుద్దీన్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ముఠా సభ్యులను శంషాబాద్‌ పోలీసులు గురువారం కటకటాల్లోకి నెట్టారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న రెండు ట్రక్కులు, నకిలీ ఆర్సీలు, మూడు పోన్లను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌ హసన్‌నగర్‌కు చెందిన షేక్‌ అక్రమ్‌ హర్షద్‌ లారీ నడిపేవాడు. పాత ట్రక్కులకు నకిలీ ఆర్సీలను సృష్టించడంపై దృష్టి సారించాడు. ఆసిఫ్‌నగర్‌, విజయ్‌నగర్‌కాలనీకి చెందిన ఖాలేద్‌ అక్తర్‌ మోహిద్దీన్‌, ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్‌ ఇక్బాల్‌తో కలిసి హర్షద్‌ పాత ట్రక్కులను అరుణాచల్‌ప్రదేశ్‌ ఆర్సీలు, నిరభ్యంతర పత్రాలతో కొత్త మోడల్‌గా నమ్మించి అమాయకులకు అధిక ధరలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. మోసపోయిన శంషాబాద్‌ మండలం, కాచారానికి చెందిన కె.సుధాకర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని