Honey Trap: మాటలతో ముగ్గులోకి దింపి.. ‘ఆమె’ వలలో బడా బాబులు

తన అందంతో ప్రముఖులను వలలో వేసుకుని వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి తర్వాత పెద్ద మొత్తం డిమాండు చేస్తున్న ఘటనలో శుక్రవారం భువనేశ్వర్‌ పోలీసులు అరెస్టు చేసిన మహిళకు సంబంధించిన కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 09 Oct 2022 09:33 IST

ఖరీదైన వాహనాలతో అరెస్టయిన మహిళ

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: తన అందంతో ప్రముఖులను వలలో వేసుకుని వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి తర్వాత పెద్ద మొత్తం డిమాండు చేస్తున్న ఘటనలో శుక్రవారం భువనేశ్వర్‌ పోలీసులు అరెస్టు చేసిన మహిళకు సంబంధించిన కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఆమె వద్ద స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌, చరవాణుల్లోని దృశ్యాలు, చిత్రాల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆమెను విచారిస్తున్నారు.

ఆమెకు భువనేశ్వర్‌లో విశాలమైన భవనం ఉంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తుంది. తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన నివాస భవనంలోకి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా మెలిగి వాటిని రహస్యంగా చిత్రీకరించేది. తర్వాత తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించేది. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల ఖరీదైన కార్లున్నాయి. ఫార్మ్‌ హౌస్‌ కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని