ఆత్మహత్య చేసుకో.. బీమా వస్తుంది: భార్యను వేధించిన భర్త
ముగ్గుర్ని యువతులను పెళ్లి చేసుకుని ఓ యువకుడు మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది.
యువతులను మోసగించి మూడు పెళ్లిళ్లు
మహేంద్రబాబు
దొర్నిపాడు, న్యూస్‌టుడే: ముగ్గురు యువతులను పెళ్లి చేసుకుని ఓ యువకుడు మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం దాచిపెట్టి తన గ్రామానికే చెందిన మరో మహిళను ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు సంబంధించిన బీమా డబ్బులు వస్తాయని తల్లి వద్ద ప్రస్తావించాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. భరించలేక ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మూడేళ్ల తర్వాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో మహేంద్రబాబు పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి చరవాణి ద్వారా ప్రైవేటు లోన్ యాప్ నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మూడో పెళ్లి విషయం తెలిసిన రెండో భార్య అతనిపై, అతని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప ఫేమ్ జగదీశ్ అరెస్ట్
యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన సినీ నటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్(31)ను బుధవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. -
అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!
చితిలో కాలిపోతున్న కుమార్తె మృతదేహాన్ని బయటకు తీసిన తల్లిదండ్రులు.. దాన్ని అలాగే తీసుకొని పోలీస్‌స్టేషనుకు వెళ్లారు. -
13 వేల బాతు పిల్లల మృత్యువాత.. నష్టాన్ని తట్టుకోలేక..
మిగ్జాం తుపాను కారణంగా రూ.15 లక్షల విలువ చేసే బాతు పిల్లలు మృతి చెందగా.. నష్టాన్ని తట్టుకోలేక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది. -
సుఖ్‌దేవ్‌సింగ్ హత్యకేసు నిందితుల్లో సైనికుడు!
రాష్ట్రీయ రాజ్‌పూత్ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గోగామేడీ హత్య రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జైపుర్‌లో జరిగిన ఈ హత్యను నిరసిస్తూ కర్ణిసేన బుధవారం రాజస్థాన్ బంద్ నిర్వహించింది. -
భార్యాబిడ్డలను చంపి రైల్వే వైద్యుడి ఆత్మహత్య!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్యాపిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహదేవ్ యాప్ నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడు అసిమ్‌దాస్ తండ్రి సుశీల్‌దాస్(62) అనుమానాస్పద స్థితిలో మరణించారు. -
పోలీసులు కొట్టారని..పెట్రోల్ పోసుకున్నాడు
సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. -
పింఛను సొమ్ముతో వాలంటీరు పరారీ
పింఛను సొమ్ముతో గ్రామ వాలంటీరు పరారైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. -
అపహరించి.. డబ్బులు డిమాండ్ చేసి
డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు.


తాజా వార్తలు (Latest News)
-
Gaddam Prasad Kumar: తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
-
Hamas: ‘మీరే ఇజ్రాయెల్‌ను అడ్డుకోగలరు’.. పాక్ మద్దతు కోరిన హమాస్..!
-
Vijay: మిగ్జాం తుపాను.. అభిమానులంతా సాయం చేయాలని పిలుపునిచ్చిన విజయ్
-
CM Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
-
US Presidential Debate: వివేక్ ఆరోపణలు.. మౌనంగా ఉండిపోయిన నిక్కీ హేలీ
-
Hyderabad: ప్రగతిభవన్ ముందు బారికేడ్లు, గ్రిల్స్ తొలగింపు