ఆత్మహత్య చేసుకో.. బీమా వస్తుంది: భార్యను వేధించిన భర్త
ముగ్గుర్ని యువతులను పెళ్లి చేసుకుని ఓ యువకుడు మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది.
యువతులను మోసగించి మూడు పెళ్లిళ్లు
మహేంద్రబాబు
దొర్నిపాడు, న్యూస్‌టుడే: ముగ్గురు యువతులను పెళ్లి చేసుకుని ఓ యువకుడు మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం దాచిపెట్టి తన గ్రామానికే చెందిన మరో మహిళను ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు సంబంధించిన బీమా డబ్బులు వస్తాయని తల్లి వద్ద ప్రస్తావించాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. భరించలేక ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మూడేళ్ల తర్వాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో మహేంద్రబాబు పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి చరవాణి ద్వారా ప్రైవేటు లోన్ యాప్ నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మూడో పెళ్లి విషయం తెలిసిన రెండో భార్య అతనిపై, అతని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP-Adani Group: షిర్డీ సాయికే.. స్మార్ట్‌గా ఇచ్చేశారు.. ఇదో భారీ కుంభకోణం
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!