కుమరాంలో భారీ చోరీ

జామి మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు

Updated : 26 Nov 2022 04:39 IST

50 తులాల చొప్పున బంగారం, వెండి అపహరణ'

పరిశీలిస్తున్న సీఐ సింహాద్రినాయుడు తదితరులు

జామి, న్యూస్‌టుడే: జామి మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్న పిన్నింటి ప్రసాదరావు ఈనెల 19న తన కుమార్తె, భార్యతో కలిసి బిలాస్‌పూర్‌ వెళ్లారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం వారి ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు వచ్చిన స్థానిక మహిళ కర్రి పాపయ్యమ్మ తలుపు తాళాలు తీసి ఉండడాన్ని గమనించింది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉండడం, దుస్తులు చిందరవందరగా పడి ఉండడం చూసి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చింది. ఈక్రమంలో ఎస్‌.కోట మండలం సీతంపేటలో ఉంటున్న మరో కుమార్తె గాయత్రి విషయం తెలుసుకుని భర్త రాజేష్‌తో కలసి హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. నగలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సింహాద్రి నాయుడు, ఎస్సై వీరబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూటీం వచ్చి ఆధారాలు సేకరించింది. యజమాని లేకపోవడంతో ఎంత చోరీకి గురైందో ఇంకా తెలియలేదు. తమకున్న సమాచారం ప్రకారం 50 తులాల బంగారం, 50 తులాల వెండి పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకుని, కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని