కటకటాల్లోకి నిత్య పెళ్లికొడుకు
ఒకరికి తెలియకుండా మరొకరిని మనువాడుతూ.. ఇలా నాలుగు వివాహాలు చేసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకును పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
నిందితుడితో పాడేరు పోలీసులు
పాడేరు, న్యూస్టుడే: ఒకరికి తెలియకుండా మరొకరిని మనువాడుతూ.. ఇలా నాలుగు వివాహాలు చేసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాడేరు సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. డుంబ్రిగుడ మండలం చెలిమరవలస గ్రామానికి చెందిన కొర్రా దామోదర్(37), పాడేరులోని సుండ్రుపుట్టులో నివాసముంటున్నాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరితో రహస్యంగా కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన నాలుగో భార్యతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియోను తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపాడు. ఈ విషయం తెలుసుకున్న నాలుగో భార్య పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బాగోతం బయటపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Vijay Deverakonda: అవును ఇది నిజం.. ‘గీత గోవిందం’ కాంబినేషన్ రిపీట్!
-
Politics News
BRS: 20 మంది భారాస నాయకులపై బహిష్కరణ వేటు
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
Sports News
Pervez Musharraf - MS Dhoni: ‘నీ హెయిర్ స్టైల్ బాగుంది ధోనీ.. జుట్టు కత్తిరించుకోవద్దు’
-
General News
AP SI Posts: ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి