వివాదాస్పదమైన ఉపాధ్యాయురాలి తీరు

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగిన ఘటన మండలంలోని రవీంద్రనగర్‌-1 గ్రామంలోని హిందీ మీడియం పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది.

Updated : 27 Nov 2022 05:32 IST

తరగతులు బహిష్కరించి విద్యార్థుల ఆందోళన

పాఠశాల ఆవరణలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, పోషకులు

చింతలమానెపల్లి, న్యూస్‌టుడే: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగిన ఘటన మండలంలోని రవీంద్రనగర్‌-1 గ్రామంలోని హిందీ మీడియం పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. విద్యార్థులు, పోషకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధ్యాయురాలు సవిత పాఠాలు చెప్పకుండా తన గురించి, తమ కుటుంబం గురించి గొప్పలు చెప్పుకుంటూ.. పిల్లల్ని వారి నేపథ్యాన్ని హేళన చేసేలా మాట్లాడుతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో శనివారం పోషకులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయురాలి తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక తరగతుల పేరుతో బడికి అమ్మాయిలను మాత్రమే ముందుగా రమ్మని వారి ఫొటోలు, వీడియోలు తీస్తూ ఇతరులకు చరవాణిలో పంపిస్తోందని పలువురు ఆరోపించారు. ఆమె తీరుతో విసిగివేసారిన పిల్లలు.. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శనివారం బడికి వచ్చి ఆందోళన చేశారు. సమాచారం అందడంతో ఎస్సై విజయ్‌ పాఠశాలకు వచ్చి పిల్లలు, పోషకులను సముదాయించారు. అనంతరం స్టాఫ్‌ రూంలో ఉపాధ్యాయులతో చర్చించారు. అదే సమయంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, వైస్‌ ఎంపీపీ మనోజిత్‌ కుమార్‌ మండల్‌ బడికి వచ్చి ఉపాధ్యాయురాలు తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ఎంఈఓ సోమయ్య దృష్టికి తీసుకెళ్లగా సోమవారం పాఠశాలను తనిఖీ చేస్తానన్నారు. హిందీ మీడియం పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉండగా.. వారి మధ్య సఖ్యత లేదని, ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు సింధూజ, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు సవిత ఒకరితో ఒకరు మాట్లాడుకోరని స్థానికులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు