వాహనచోదకుడి హల్‌చల్‌

ఓ చోదకుడు శిరస్త్రాణం ధరించకుండా వేగంగా ద్విచక్ర వాహనం నడుపుతూ అడ్డుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐను ఢీకొట్టి పరారయ్యాడు.

Updated : 30 Nov 2022 04:39 IST

ట్రాఫిక్‌ ఎస్‌ఐకి గాయాలు

ఎస్‌ఐ ప్రసాద్‌

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఓ చోదకుడు శిరస్త్రాణం ధరించకుండా వేగంగా ద్విచక్ర వాహనం నడుపుతూ అడ్డుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐను ఢీకొట్టి పరారయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాణిపేట ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ మంగళవారం జ్ఞానాపురం కూడలిలో విధులు నిర్వహిస్తున్నారు. అటుగా శిరస్త్రాణం ధరించకుండా వేగంగా వస్తున్న ద్విచక్రవాహన చోదకుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతను వాహనాన్ని ఆపకుండా ఎస్‌ఐని ఢీకొట్టి పరారయ్యాడు. ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని