వ్యసనాలకు బానిసై దొంగతనాలు

చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ తెలిపారు.

Updated : 30 Nov 2022 05:24 IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రమణ

కొత్తపేట, రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలేనికి చెందిన పెచ్చేటి విజయ్‌, పెనుగొండ మండలం మల్లంకు చెందిన గెద్దాడ సురేంద్ర, గూడాల చంద్రశేఖర్‌స్వామి, తణుకుకు చెందిన షేక్‌ మున్నా అంబాజీపేట మండలం కె.పెదపూడిలో ఒక ఇంటిలో జరిగిన దొంగతనంలో నిందితులుగా ఉన్నారు. వీరిపై అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో రెండు, అమలాపురంలో రెండు, రాజోలు, ముమ్మిడివరం, మండపేట, అంగర, రావులపాలెం పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి రూ.8.29 లక్షల విలువ గల 172.750 గ్రాముల బంగారం, రూ.4వేలు నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై గతంలో పెనుగొండ, ఆచంట, పి.గన్నవరం పోలీస్‌స్టేషన్ల కేసులలో జైల్లో ఉండగా బెయిల్‌పై వచ్చి మళ్లీ  దొంగతనాలు చేయడం ప్రారంభించారన్నారు. ఈకేసును ఛేదించిన సీసీఎస్‌ సీఐ గోవిందరాజు, పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్‌, అంబాజీపేట ఎస్సై చైతన్యకుమార్‌లను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని