వరుస చోరీలు.. జనం బెంబేలు

జిల్లా కేంద్రంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల ఒకే రోజు మూడు ఘటనలు జరిగాయి. ఓ వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన సంఘటనలో పోలీసులను పలువురు ప్రశంసించారు

Updated : 30 Nov 2022 05:13 IST

న్యూస్‌టుడే, వనపర్తి న్యూటౌన్‌

భగీరథ కాలనీలోని ఓ ఇంట్లో బీరువా లాకర్‌ను ఇటీవల పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

జిల్లా కేంద్రంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల ఒకే రోజు మూడు ఘటనలు జరిగాయి. ఓ వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన సంఘటనలో పోలీసులను పలువురు ప్రశంసించారు. మరోవైపు దొంగలు సవాలు విసురుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా చోరీలను అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పకడ్బందీ చర్యలు చేపట్టి దొంగల ఆటకట్టించాల్సిన అవసరముందని పట్టణవాసులు అంటున్నారు.

జాగ్రత్తలు తీసుకున్నా...

పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలకు వెళుతున్న వారి ఇళ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకొంటున్నారు. ఇంటికి తాళాలు ఉన్న ఇళ్లను ఎంచుకుంటున్నారు. ఊరికి వెళ్లినప్పుడు సమీప ఠాణాకు, ఇంటి పక్కనుండేవారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చోరీలు ఆగడం లేదని పలువురు వాపోతున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే పలు ఇళ్లను దోచేస్తున్నారు.
* పోలీసుశాఖ, ఇతర దాతల సహకారంతో పట్టణాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇళ్లలోనే బిగించుకున్నారు. చోరీలు మాత్రం ఆగడం లేదు. దొంగలు నంబరు ప్లేటు లేని వాహనాలపై తిరుగుతూ.. మొహాలు కనిపించకుండా మాస్కులు ధరిస్తున్నారు.

కాలనీవాసులు, గస్తీ కమిటీలతో అడ్డుకట్ట

కాలనీలు, గ్రామాల్లో పోలీసులు 24 గంటలూ తిరగడం సాధ్యం కాదు. ఒక్కో కాలనీ, గ్రామానికి ఒక్కో సమయంలో పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. కాలనీల్లో కొందరు గస్తీ కమిటీలు వేసుకొని రాత్రి వేళల్లో బృందాలుగా ఏర్పడి గస్తీ తిరగాలి. కొత్త వ్యక్తులు కనబడితే వివరాలు సేకరించాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించాలి. ఇలా చేయడం వల్ల దొంగతనాలు అరికట్టొచ్చు.

అరికట్టేందుకు చర్యలు.. ప్రణాళికాబద్ధంగా చోరీలను అరికడతాం. దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిబ్బందిచేత

పకడ్బందీ చర్యలు తీసుకొని చోరీలు జరగకుండా చూస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాలనీలు, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనబడితే సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలి.
 అపూర్వారావు, ఎస్పీ

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు