వరికోత మిషన్‌ కింద పడి మహిళ దుర్మరణం

మండలంలోని సీత్లాతండాలో వరి పొలం కోస్తుండగా వరికోత మిషన్‌ టైరు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.

Updated : 01 Dec 2022 06:43 IST


సక్కుబాయి

చిలుకూరు, న్యూస్‌టుడే: మండలంలోని సీత్లాతండాలో వరి పొలం కోస్తుండగా వరికోత మిషన్‌ టైరు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సీత్లాతండాకు చెందిన తేజావత్‌ సక్కుబాయి(52) తమ సొంత పొలాన్ని హార్వెస్టర్‌ (వరికోత మిషన్‌)తో కోయిస్తుండగా వెనుక ఉన్న ఆమెను డ్రైవర్‌ గమనించకుండా మిషన్‌ వెనుకకు మళ్లించారు. సక్కుబాయి టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు భానుప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని