మేట్రిన్‌ దంపతుల అనుమానాస్పద మృతి ?

కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ మేట్రిన్‌, ఆమె భర్త గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 02 Dec 2022 02:44 IST

మృతులు సుమన్‌, రాధ (పాత చిత్రం)

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ మేట్రిన్‌, ఆమె భర్త గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

డుంబ్రిగుడ మండలం అరకు గ్రామానికి చెందిన గుజ్జెలి రాధ (32) అరకులోయ మండలం కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలిక వసతిగృహంలో డిప్యూటీ మేట్రిన్‌గా పనిచేస్తున్నారు. ఈమె తన భర్త నన్ని సుమన్‌ (34)తో కలిసి పాఠశాల ఆవరణలోని సిబ్బంది నివాస గృహంలో  ఉంటున్నారు. సుమన్‌ స్వగ్రామం హుకుంపేట మండలం బూర్జ. వీరికి కుమార్తె బ్లెస్సీ జాయ్‌,  కుమారులు బేతేలు జాషువా, ఆకర్ష్‌ పాల్‌ మొత్తం ముగ్గురు పిల్లలు. వీరు ముగ్గురు విశాఖలో చదువుకుంటున్నారు. రాధ భర్త కూడా విశాఖ నుంచి బుధవారం రాత్రే కొత్తబల్లుగుడ వచ్చారు. గురువారం ఉదయం పాఠశాల సమయానికి రాధ కనిపించకపోవడం, ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సంతోష్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నివాసంలోని బెడ్‌రూంలో మంచంపై భార్యాభర్తలు విగతజీవులుగా కనిపించారు. తొలుత వీరిది ఆత్మహత్యగా అంతా భావించారు. అయితే రాధ మెడ వాచి ఉండటం, కళ్లు, నోరు తెరిచి ఉండగా, భర్త సుమన్‌ వాంతులు చేసుకుని విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. అల్లుడే తమ కుమార్తె రాధను చంపి, ఆ తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ఎదుట రాధ తండ్రి మాణిక్యం అనుమానం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా భార్యాభర్తల మధ్య విభేదాలున్నాయని, ముగ్గురు పిల్లలు ఉండటంతో సర్దుకుపోతారని జోక్యం చేసుకోలేదని మాణిక్యం చేశారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం పరిశీలించారు. మృతురాలి తండ్రి, బంధువుల వాంగ్మూలం తీసుకుని అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు