రోడ్డు ప్రమాదంలో జిల్లా మహిళ మృత్యువాత

ఒడిశాలోని బోడోపోకోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పాణాలు కోల్పోయారు. వీరిలో విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట మండలం పోతనాపల్లికి చెందిని బోజంకి లక్ష్మి(35) ఉన్నారు.

Updated : 02 Dec 2022 06:04 IST

భర్త, పిల్లలతో బోజంకి లక్ష్మి

ఎస్‌.కోట, న్యూస్‌టుడే: ఒడిశాలోని బోడోపోకోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పాణాలు కోల్పోయారు. వీరిలో విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట మండలం పోతనాపల్లికి చెందిని బోజంకి లక్ష్మి(35) ఉన్నారు. పూరి ప్రాంతంలో జరిగిన వివాహానికి ఈమెతో పాటు విశాఖనగరానికి చెందిన మరియాఖాన్‌(24), రాకేష్‌కుమార్‌ అలియాస్‌ రాఖీ(35), కబీర్‌(28) కారులో గురువారం ఉదయం బయలుదేరారు. ఈక్రమంలో మరమ్మతులకు గురై రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. లక్ష్మి 2006లో విశాఖకు చెందిన వ్యక్తిని వివాహమాడారు. అతను పూర్ణామార్కెట్‌లో ప్లాస్టిక్‌ హోల్‌సేల్‌ దుకాణాన్ని నడుపుతున్నారు. వారికి కుమార్తె భవ్యశ్రీ, కుమారుడు దిలీప్‌ కుమార్‌ ఉన్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు