Chandragiri: చంద్రగిరి యువతిది ఆత్మహత్య కాదు.. హత్యే..!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన యువతి మోహన కృష్ణ (19) ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది.
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన యువతి మోహన కృష్ణ (19) ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. తాజాగా వెల్లడైన పోస్టుమార్టం నివేదికలో ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యగా తేలింది. మోహనకృష్ణను ఎవరో గొంతు నులిమి హత్య చేసినట్లుగా నివేదిక ద్వారా వెల్లడైంది. దీంతో చంద్రగిరి పోలీసులు ఆత్మహత్యను హత్య కేసు నమోదు చేశారు.
ఇదీ నేపథ్యం..
రెడ్డివారిపల్లెకు చెందిన ముని రాజా కుమారై మోహన కృష్ణ ఇంటర్ చదువుతోంది. ఆంజనేయపురానికి చెందిన వికాస్‌ను ఆమె ఐదేళ్లుగా ప్రేమిస్తోంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలో యువతీ, యువకులను ఇరు కుటుంబాల వారు దూరంగా ఉంచారు. ఈ క్రమంలో జులై 7న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మోహనహ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రేమకు అంగీకారం తెలపకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అయితే తాజాగా వెల్లడైన పోర్టమార్టం నివేదికలో యువతిది హత్యగా తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Cheetah: ఆ నమీబియా చీతాల్లో.. ‘సాశా’ మృత్యువాత
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్
-
World News
Israel: ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు!
-
Politics News
Dharmapuri Srinivas: అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క