అనుమానాస్పదస్థితిలో యువకుడు..
తల్లికి వైద్యం చేయించేందుకు ఇంటి నుంచి నవంబర్ 21న బయటకి వచ్చి అదృశ్యమైన యువకుడు ఆదివారం శవమై కనిపించాడు.
పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా
శ్రీనాథ్ (పాతచిత్రం)
పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తల్లికి వైద్యం చేయించేందుకు ఇంటి నుంచి నవంబర్ 21న బయటకి వచ్చి అదృశ్యమైన యువకుడు ఆదివారం శవమై కనిపించాడు. పట్టణంలోని జీఆర్ఎస్ తైలం తోపులో ఓ యువకుడి మృతదేహం కుళ్లిన స్థితిలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాధితులు అక్కడి చేరుకుని మృతుడు పట్టణంలోని ఒకటో వార్డు మంగళం కాలనీకి చెందిన గంగులప్ప కుమారుడు శ్రీనాథ్(26)గా గుర్తించారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మంగళం కాలనీలో నివాసముంటున్న శ్రీనాథ్ అవివాహితుడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 21 తేదీన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో స్థానికంగా ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించారు. ఆ రోజు సాయంత్రం నుంచి యువకుడు ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో నవంబర్ 24 తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. అదృశ్యమైన శ్రీనాథ్ మృతి చెందడంతో ఆదివారం తల్లిదండ్రులు, మాలమహానాడు సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. యువకుడు గ్రామంలోని ఓ వివాహితతో సన్నిహితంగా మెలిగేవాడని, అది మనసులో పెట్టుకున్న ఆమె భర్త పలు మార్లు గొడవ పడ్డారని తల్లిదండ్రులు వివరించారు. ఈ నేపథ్యంలో వారంతా తమ కుమారుడ్ని హత్య చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు. ఈ విషయంపై ఎస్సై మోహన్‌కుమార్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనిన్నారు. వాస్తవాలు విచారణలో వెలుగులోకి వస్తాయన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Director Sagar: ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్‌పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!