Crime News : భూవివాదంలో బంధువు తల నరికి.. ఆపై సెల్ఫీ తీసుకుని..
భూతగాదాల(Land Dispute) నేపథ్యంలో ఓ వ్యక్తి తల నరికి బంధువే అత్యంత క్రూరంగా హత్య(Murder) చేశాడు. అనంతరం తలతో నిందితులు సెల్ఫీ తీసుకున్నారు.
ఖుంతీ : ఝార్ఖండ్(Jharkhand)లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదం(Land Dispute) నేపథ్యంలో ఓ వ్యక్తి తన సమీప బంధువు తల నరికి అత్యంత క్రూరంగా హత్య(Murder) చేశాడు. అనంతరం నిందితులు ఆ తలతో సెల్ఫీ( Selfie) తీసుకున్నారు. ఈ ఘటన ఖుంతీ జిల్లాలోని ముర్హూ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాను ముండా(24) అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తమ కుమారుడు కనిపించలేదని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మేనల్లుడు సాగర్ ముండా, అతడి స్నేహితులే తన కుమారుడిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో ఆరోపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం కాను మొండాన్ని సమీపంలోని కమాంగ్ గోప్లా అడవిలో పోలీసులు కనుగొన్నారు. అతడి తల అక్కడికి 15 కి.మీ దూరంలో లభించింది. నరికిన తలతో నిందితులు సెల్ఫీ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు, రక్తం మరకలతో ఉన్న రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన