క్యూ ఆర్‌ కోడ్‌తో మోసం

క్యూ ఆర్‌ కోడ్‌తో ఓ మోసగాడు ఓ చిరు వ్యాపారిని మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.

Updated : 10 Dec 2022 04:33 IST

కోడ్‌ పేపరును చూపిస్తున్నబాధితుడు రమణయ్య

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే : క్యూ ఆర్‌ కోడ్‌తో ఓ మోసగాడు ఓ చిరు వ్యాపారిని మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కొమరోలుకు చెందిన కొవ్వూరి రమణయ్య స్థానిక  పోస్టు ఆఫీస్‌ ఎదురుగా చికెన్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఖాతాదారుల సౌలభ్యం కోసం యూపీఐ ఆధారిత క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ను దుకాణం బయట ప్రదర్శించారు. ఇదే అదనుగా భావించిన మోసగాడు తన బ్యాంకు ఖాతాకు నగదు పడేలా తన సొంత క్యూఆర్‌కోడ్‌తో ఏర్పాటు చేసుకున్న స్టిక్కర్‌ను చిరు వ్యాపారి దుకాణం బయట పెట్టిన ఉన్న బోర్డుకు అంటించాడు. దీంతో చికెన్‌ దుకాణంలో వ్యాపారి జరిగే నగదు రహిత లావాదేవీలన్నీ మెసగాడి బ్యాంక్‌ ఖాతాకు జమ అవుతున్నాయి. ఇటీవల రమణయ్య తన బ్యాంకు ఖాతాను పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది. మెసగాడి క్యూఆర్‌కోడ్‌ స్టిక్కర్‌ను కనిపెట్టాడు. తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై సుబ్బరాజు మాట్లాడుతూ విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు