Andhra News: గంజాయితో దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
వారంతా 25 ఏళ్ల లోపు వయసులో ఉన్నవారు.. మంచి చదువు చదువుకున్నారు. విలాసాలకు అలవాటు పడి, వస్తున్న జీతంతో సంతృప్తి చెందక అడ్డదారులు తొక్కుతూ పోలీసులకు దొరికిపోయారు.
సీలేరు, న్యూస్‌టుడే: వారంతా 25 ఏళ్ల లోపు వయసులో ఉన్నవారు.. మంచి చదువు చదువుకున్నారు. విలాసాలకు అలవాటు పడి, వస్తున్న జీతంతో సంతృప్తి చెందక అడ్డదారులు తొక్కుతూ పోలీసులకు దొరికిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారును ఆపి ప్రశ్నించగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతాలను చూడటానికి వచ్చామని చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి కారును పరిశీలించగా నాలుగు కేజీల గంజాయి పట్టుబడింది. దీనిపై పోలీసులు విచారించగా గూడెం కొత్తవీధి మండలం చల్లనిశిల్పలో గంజాయిని కొని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు వారు చెప్పారు. నిందితులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గండికోట లక్ష్మీసాయి, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ కిజార్ అహ్మద్‌గా గుర్తించారు. గంజాయి సరఫరా చేసింది బి.కున్నులుగా పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాగా, ఒకరు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. వీరి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని, మరొకరు పరారీలో ఉన్నారని సీలేరు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Nara Lokesh: జగన్ మాదిరిగా వాయిదాలు కోరను.. సీఐడీ నోటీసుపై స్పందించిన లోకేశ్
-
హైకమిషనర్‌ని అడ్డుకోవడం అవమానకరం.. గురుద్వారా ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్
-
Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో ‘మోత మోగింది’