Crime News: ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో.. ముగ్గురు మృతి

ఏపీలోని వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Updated : 20 Jan 2023 12:31 IST

చాపాడు: ఏపీలోని వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్‌ కాలనీకి చెందిన 11 మంది బంధువులు టెంపో వాహనంలో తిరుమల దర్శనానికి వెళ్లారు. అక్కడ నుంచి  స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మైదుకూరు- ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై టెంపో వాహనం టైర్‌ పంక్చర్ అయ్యింది. ఈ క్రమంలో అదుపుతప్పిన టెంపో..  చాపాడు వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రామలక్ష్మమ్మ(50), ఓబులమ్మ(47), అనూష(30) అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారనగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని