దిల్లీ మద్యం కేసు.. రూ.72 కోట్ల ఆస్తుల జప్తు
దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం కేసులో పలువురు నిందితులకు చెందిన రూ.72 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ 17కు వాయిదా
ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం కేసులో పలువురు నిందితులకు చెందిన రూ.72 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను విడుదల చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి విజయ్ నాయర్‌తో పాటు సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, దినేష్ అరోడా ఆస్తులున్నట్లు తెలిసింది. వాటిలో దిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో నిందితులకు ఉన్న స్థిర, చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలున్నాయని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈడీ వర్గాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. దిల్లీ మద్యం కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దిల్లీ ఆబ్కారీ శాఖ అధికారులు కుల్దీప్సింగ్, నరేంద్ర సింగ్; ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండియాఏహెడ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రులను ఏ1 నుంచి ఏ7 వరకు పేర్కొంటూ సీబీఐ గతేడాది నవంబరు 25న ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ ప్రారంభించింది. ఛార్జిషీట్లో కొన్ని పత్రాలు సక్రమంగా లేకపోవడం (మసకగా ఉండటం) వంటి కారణాలతో సమగ్ర పరిశీలనకు తమకు మరికొంత సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. మరోవైపు విచారణాధికారి వైద్యపరమైన కారణాలతో సెలవులో ఉండటంతో కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: బ్రెయిన్ మ్యాపింగ్‌తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
Politics News
Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం
-
Sports News
MS Dhoni: కొబ్బరి బొండం పట్టుకుని.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి..
-
Politics News
Andhra News: ‘పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదు.. నేను చాలు’
-
Crime News
Fire Accident: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)