ఇన్‌ఫార్మర్‌కు మరణశిక్ష విధించాం: మావోయిస్టులు

భద్రతా బలగాలు వైమానిక దాడులు జరపడానికి కారణమైన ఇన్‌ఫార్మర్‌ తాటి హిడ్మాకు మరణశిక్ష విధించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Published : 26 Jan 2023 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రతా బలగాలు వైమానిక దాడులు జరపడానికి కారణమైన ఇన్‌ఫార్మర్‌ తాటి హిడ్మాకు మరణశిక్ష విధించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో బుధవారం ఒక ప్రకటన విడుదలైంది. హిడ్మా మరణానికి పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు భద్రతా బలగాలు ఈ నెల 11వ తేదీ పామేడు-తెలంగాణ సరిహద్దుల్లో తమ పార్టీ నాయకత్వం, ప్రజలు, పీఎల్‌జీఏ దళాలపై డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడి చేశారని ఈ ప్రకటనలో వివరించారు. దంతెవాడ బొట్టెలోగ్‌ గ్రామానికి చెందిన తాటి హిడ్మా ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడి జరిగిందన్నారు. మావోయిస్టు పార్టీని దెబ్బతీసే ఉద్దేశంతో పోలీసులు ఇన్ఫార్మర్‌ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని ఆ ప్రకటనలో ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు